Home  »  TV News  »  Guppedantha Manasu:ఆ సీక్రెట్ తెలిసిపోయిందిగా.. ఇక మొదలెడదామా!

Updated : Dec 28, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -958 లో... భద్రకి డ్రైవర్ గా మహేంద్ర ఉద్యోగం ఇచ్చి ఇంటికి తీసుకొని వస్తాడు. అతన్ని అనుపమ, వసుధారలకి పరిచయం చేస్తాడు. అతను ఎక్కడ ఉంటాడని అనుపమ అడుగుతుంది. ఎక్కడో బయట ఉంటాడని మహేంద్ర అనగానే.. బయట ఎందుకు ఇక్కడే ఉండమని చెప్పమని అనుపమ చెప్తుంది. మరొకవైపు ఇప్పుడు నేను ఇంకొక రౌడీని పెట్టానని దేవయానికి శైలేంద్ర చెప్తాడు. ఇప్పటివరకు చాలా మంది రౌడీలను పెట్టావని దేవయాని అనగానే ఇప్పటివరకు వేరు ఇప్పుడు వేరు.. ఇప్పుడు ఏర్పాటు చేసిన రౌడీ మాములు రౌడీ కాదు అంటూ భద్ర గురించి దేవయానికి శైలేంద్ర గొప్పగా చెప్తుంటాడు.

ఆ తర్వాత నువ్వు అలా చెప్తూ ఉంటే అతని గురించి తెలుసుకోవాలనిపిస్తుందని, అతని పేరేంటని దేవయాని అడుగుతుంది. చెప్పను మమ్మీ అది సీక్రెట్ అంటూ భద్ర గురించి దేవయానికి కూడా చెప్పడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరకి ధరణి వస్తుంది. ఏంటి మేమ్ కాఫీ తీసుకొని రమ్మని చెప్పకుండానే తీసుకొని వచ్చావని ధరణితో దేవయాని అంటుంది. నేను మీకు కాఫీ ఏం తీసుకొని రాలేదు.. ఇవి జస్ట్ ఖాళీ కాఫీ కప్ లు అక్కడ పెడుదామని తీసుకొని వచ్చానని ధరణి వాళ్లకి కౌంటర్ వేస్తుంది. మరొకవైపు వసుధారకి తెలియని నెంబర్ నుండి.. ఇంకా ఎన్ని రోజులు ఆలోచిస్తావ్? ఎండీ సీట్ కావాలా? రిషి కావాలా అంటూ మెసేజ్ వస్తుంది. అ మెసేజ్ చూసి ఇది ఖచ్చితంగా శైలేంద్ర పంపి ఉంటాడని వసుధార అనుకుంటుంది. ఆ తర్వాత వసుధార గది దగ్గరకి ఎవరో వచ్చినట్లు అనిపించి బయటకు వెళ్తుంది. తీరా చుస్తే భద్ర ఉంటాడు. నువ్వు ఏంటి ఇక్కడ అని వసుధార డౌట్ గా అడుగుతుంది. వాటర్ కోసం వచ్చనని చెప్పగానే వసుధార వాటర్ ఇస్తుంది. మరొకవైపు రిషి స్పృహలోకి వచ్చి వసుధారని గుర్తుకు చేసుకుంటాడు. నాగురించి వసుధార ఎంత బాధపడుతుందో.. నేను పక్కన లేకుంటే తను నా గురించి అలోచిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నట్లు వసుధారకి ఎలాగైనా చెప్పాలని రిషి అనుకుంటాడు.

మరొకవైపు వసుధార రాత్రి వచ్చిన మెసేజ్ గురించి ఆలోచిస్తుంటుంది. వెంటనే శైలేంద్రకి ఫోన్ చేస్తుంది. కానీ అ ఫోన్ ఫణీంద్ర లిఫ్ట్ చేస్తాడు. కానీ శైలేంద్ర లిఫ్ట్ చేసాడని వసుధార అనుకుని.. నువ్వు రాత్రి నాకు మెసేజ్ చేసావని నాకు తెలుసు. కాలేజీని మాత్రం నీ చేతులో పెట్టను అంటూ వార్నింగ్ ఇస్తుంది. వసుధార అని ఫణీంద్ర అనగానే.. వసుధార ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత శైలేంద్రని ఫణీంద్ర పిలిచి.. ఇందాక నీకు ఒక కాల్ వచ్చింది ఎవరు ఏంటి అని నీకు చెప్పను కానీ ఒకటి చెప్పు. ఎండీ సీట్ పై నీకు ఆశ ఉందా అని అడుగుతాడు. దానికి శైలేంద్ర కంగారుపడుతు లేదని అంటాడు అయితే ఎండీ చైర్ పై ఎలాంటి ఆశ లేదని నాకు ఒక లెటర్ రాసి ఇవ్వు అనగానే శైలేంద్రకి ఇష్టం లేకున్నా ఫణింద్రకి డౌట్ వస్తుందని రాసి ఇస్తాడు. మరొక వైపు ఫోన్ ఫణీంద్ర సర్ లిఫ్ట్ చేసాడు. ఏం అనుకుంటున్నారో అని వసుధార అనుకుంటుంది అప్పుడే ఫణింద్ర తన క్యాబిన్ కి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.